తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామము కలదు. ఆ గ్రామములో 1911 సంవత్సరములో గ్రామములోని పెద్దలు, యజ్ఞయాగా దీక్షితులు, వేదాధ్యయన తత్పరులు అయిన బ్రహ్మంగోత్తములు సంప్రదాయసిద్దముగా శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిరి. ఇది చాల మహిమగల దేవత కార్యక్రమము.
ఈ నవరాత్రి ఉత్సవములలో శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతిని, శ్రీ రుక్మిణి సత్యభామ సహిత గోపాల క్రిష్ణ మూర్తిని ఆవాహన చేసి తొమ్మిది రోజులు రెండుపూటలా సహస్ర నామార్చనపూర్వక షోడశోపచరములు, పగటిపూట తొమ్మిది రోజులు బ్రాహ్మణా సమారాధనలు భక్తుల సహాయముతో చేయుచున్నారు. ప్రక్రుతి విపరీత్యములు వచ్చినను మానకుండగా అవిచ్చిన్నముగా 99 సంవత్సరములు నుండి నిత్య పూజలు యధావిధి0గా జరుపుచున్నారు.
