Feeds:
టపాలు
వ్యాఖ్యలు

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామము కలదు. ఆ గ్రామములో 1911 సంవత్సరములో గ్రామములోని పెద్దలు, యజ్ఞయాగా దీక్షితులు, వేదాధ్యయన తత్పరులు అయిన బ్రహ్మంగోత్తములు సంప్రదాయసిద్దముగా శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిరి. ఇది చాల మహిమగల దేవత కార్యక్రమము.
ఈ నవరాత్రి ఉత్సవములలో శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతిని, శ్రీ రుక్మిణి సత్యభామ సహిత గోపాల క్రిష్ణ మూర్తిని ఆవాహన చేసి తొమ్మిది రోజులు రెండుపూటలా సహస్ర నామార్చనపూర్వక షోడశోపచరములు, పగటిపూట తొమ్మిది రోజులు బ్రాహ్మణా సమారాధనలు భక్తుల సహాయముతో చేయుచున్నారు. ప్రక్రుతి విపరీత్యములు వచ్చినను మానకుండగా అవిచ్చిన్నముగా 99 సంవత్సరములు నుండి నిత్య పూజలు యధావిధి0గా జరుపుచున్నారు.

ప్రకటనలు

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామమునందు ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి భవన నిర్మాణము కొరకు శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం గారి కుమారులు వెంకట విశ్వేశ్వర సత్యనారాయణ మూర్తి , సర్వేశ్వర శాస్త్రిగారి కుమారులు లక్ష్మి నరసింహ మూర్తి , సోమేశ్వరరావు మరియు శ్రీ గోరుగంతు ఆక్కుభొట్లు గారి కుమారులు వెంకట సుబ్బారాయుడు , చంద్రుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకట శివుడు, సాంబ శివుడు,విశ్వనాధం,గణపతి గ్రామమధ్యలో ఉన్న అతి విలువ అయిన వారియొక్క స్థలమును ఇచ్చినారు. అనేకమంది దాతలు భావన నిర్మాణమునకు వారియొక్క శక్తికొలది విరాళాలు ఇచ్చి భవనమును నిర్మాణమునకు సహకరించినారు. వారియొక్క వివరములు దీనినందు vivaramalu పొందుపరచడము అయినది.

ఈ భవనము నందు రెండు అంతస్తులుగా నిర్మించడమయినది. రెండవ అంతస్తులో  స్వామివారియొక్క  పూజ మందిరము ఏర్పాటు చేయడమయినది. మొదటి అంతస్తునందు బ్రాహ్మణసమారాధన జరుపుటకు నిర్మించడమయినది. ఈ భావనమునకు front elevation, రెండవ అంతస్తునందు

marble flooring, electrical మరియు panting work చేయుటకు దాతలనుండి విరాళములను కోరుచున్నాము.

BANK DETAILS

GORUGANTHU RAMACHANDRAM
ANDHRA BANK, MAIN BRANCH, AMALAPURAM.

A/C NO

000810011024353

ముఖ్య గమనిక :పదివేలు, ఆఫైన విరాళము ఇచ్చిన దాతల గోత్రనామములతో ప్రతి సంవత్సరము శ్రీ చింతామణి గణపతి నవరాత్రులలో ప్రతిరోజు సహస్రనామార్చన జరుపబడును.

విరాళములు ఇచ్చు దాతలు ఈ క్రింది వారిని సంప్రదించవలెను.

శ్రీ గోరుగంతు రామచంద్రం, Managing Trustee, నరేంద్రపురం,

Ph:040-205225 & MOBILE: 9959234251,
email:ganapathi.naredrapuram@gmail.com.
శ్రీ భమిడిపాటి రామచంద్రం, నరేంద్రపురం,Ph:9989639658.
శ్రీ తటవర్తి శివ శంకర నాగ ప్రసాద్, నరేంద్రపురం.
శ్రీ ఆకెళ్ళ.J.V. శర్మ(విస్సు), నరేంద్రపురం ,Ph:9491439185.
శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం,హైదరాబాద్, Ph: 9949093460,
email:sst_2002@rediffmail.com.
శ్రీ భమిడిపాటి సోమనాధ శాస్రి, హైదరాబాద్,Ph:9866251038.
శ్రీ పెద్దాడ గణపతి శర్మ,హైదరాబాద్, Ph:9849237267.
శ్రీ చింత కృష్ణ నాగ ప్రసాద్, హైదరాబాద్, Ph:9394272259.
శ్రీ గోరుగంతు రవిచంద్ర, హైదరాబాద్,Ph:9849496094.
శ్రీ గోరుగంతు చంద్రశేఖర్,బెంగుళూరు.
శ్రీ తటవర్తి నాగ రవీంద్ర ప్రసాద్, కాకినాడ, Ph:0884-2372287,
email:rtatavarty@yahoo.com.
శ్రీ గరిమెళ్ళ గోపాలకృష్ణ ,కాకినాడ, Ph: 9989483915.
శ్రీ మంగిపూడి వంశీకృష్ణ, UK.Ph:004478940880050.
శ్రీ ఆకెళ్ళ వెంకట సత్య నాగ ప్రసాద్, USA.

చింతామణి గణపతి: ఇంద్రుడు చేసిన అహల్యగమనానికి కోపించి గౌతముడు ఇంద్రుని శపించెను. ఆ  శాపము వలన ఇంద్ర దేహము భగ చిహ్నములు కలదాయను. ఇంద్రుడు భయపడి సిగ్గుతో ఇంద్రగోపకమనే  కీటక రూపమును  ధరించి తామర తూడులో దాగి యుండెను. దేవతలు ఇంద్రుని అవస్థను తెలుసుకొని గౌతమముని చేరి ప్రార్ధించి ఇంద్ర శాప నివారనోపయమును అడిగిరి.గౌతముడు గణేశుని షడక్షర మహా మంత్రమును ఇంద్రునికి ఉపదేశము చేసినచో అతడు దానిని అనుష్ట్టించి గణేశుని ఆరాధించగా భగ చిహ్నములు పోయి నేత్రములు ఏర్పడును అని చెప్పెను.

గౌతముని అనుజ్ఞ పొందిన దేవతలు ఇంద్రుడు దాగియున్న సరోవరమున కేగి శాప విమోచనమును తెలిపిరి. అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి దేవగురువగు బృహస్పతి వద్ద పశ్చాత్తప్తుడు అయి తప్పులు ఒప్పుకొనెను. అప్పుడు బృహస్పతి ఇంద్రునకు షడక్షరి మంత్రమును ఉపదేశము చేసెను.

మొదటిలో చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రునకు ఈ గణపతి షడక్షరి మంత్రమను ఉపదేశించి దీని అనుష్టానమువలన సుఖముగా ఉందువు. దీనిని విస్మరించినచో  పదవీచ్యతుడవు అగుడువు అని తెలిపెను. ఆ విధముగా షడక్షరిమంత్ర అనుష్ట్టాన విస్మరణమూలముగా  అహల్యనుజేన గౌతముని శాపమునకు గురియి పదవీచ్యుతుడయ్యెను. దేవతానుగ్రహమువలన గౌతముని వలన శాపవిముక్తి తెలిసి రెండవసారి బృహస్పతి(దేవగురువు) వలన షడక్షరి మంత్రము ఉపదేశము పొందెను.

మంత్రోపదేశము కాగానే ఇంద్రునికి దివ్య శరీరము ఏర్పడి సహస్రాక్షుడిగా ఏర్పడెను. అప్పుడు దేవతలు ఇంద్రుని అమరావతికి రమ్మనిరి. అప్పుడు ఇంద్రుడు గణేశానుగ్రహము పూర్తిగా పొంది అమరావతి వత్తును అనెను. ఇంద్రుడు కదంబ వృక్షము క్రింద తగు ఆసనముఫై కూర్చుని షడక్షరి మంత్రమును జపానుశ్ట్టానముచేసెను. ఇంద్రుని తపోనిష్టకు ఆ గణేశుడు ప్రత్యక్షమయ్యెను. అది చూచి ఇంద్రుడు భయపడెను. అప్పుడు  గణేశుడు ఓ ఇంద్రా నీవు అనుష్ట్టించిన మంత్రదిష్ట్టాన దేవతను భయపడకుము. వరమిచ్చిదెను స్వికరింపు అనెను.

అప్పుడు ఇంద్రుడు తానూ తపస్సు చేసిన కదంబపురాన్ని చింతామణిపురముగా ప్రసిద్ధి కేక్కునట్లు చేయుమని కోరెను. నీవు ఇక్కడ చింతామణి గణపతివి అన్న పేరుతొ వెలయుదువుగాక  అని స్ఫటికవిగ్రహాన్ని స్థాపించి వేడుకొనెను. ఒక సరస్సు నిర్మించి చింతమరోసరస్సు అను పేరు గావింప చేసెను. ఆ చింతమనిసరస్సులో స్నానము  చేసిన వారు దివ్యదేహులు అగుదురు. చింతామణి అనగా కోరికలను తీర్చుటలో శ్రేష్ట్తమయినది.ఈ విధముగా చింతామణి అనే గణపతి  ఆరాధనకు ప్రధానమైన దేవమయినది.

భాద్రపదశుద్ద చవితినాడు చంద్ర దర్సనమువలన నీలాపనిందలు కలుగును. అవి తొలగుటకు గాను వినాయకచవితి రోజున పూజ అయిన తరువాత శ్యామంతోపాక్యానము అనెడి కధ వినవలెను. ఆ కధలో శ్రీ కృష్ణ పరమాత్మ  గణపతిని  ఆరాధించి చవితి చెంద్రుడిని చూచుటచే నీలాపనిందలు రాగా, తానూ సమర్ధుడు కనుక నీలాపనిందలు తొలగించుకొనెను. అట్టి కృష్ణ పరమాత్మను గణపతి నవరాత్రులలో కలిపి ఆరాధించుటయే ఇక్కడి ప్రత్యేకత.


“విదర్భ దేశంలో కదంబమనే ప్రసాదంలో  ఒక గొప్ప వినాయకమూర్తి కలదు. ఆయనే చింతామణి గణపతి. భక్తుల సకల భీష్టలు నేరవేర్చును.” అని నారదుడు రుక్మానందునకు తెలిపెను.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామము కలదు. ఆ గ్రామములో 1911 సంవత్సరములో  గ్రామములోని పెద్దలు, యజ్ఞయాగా దీక్షితులు, వేదాధ్యయన తత్పరులు  అయిన బ్రహ్మంగోత్తములు సంప్రదాయసిద్దముగా శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిరి. ఇది చాల మహిమగల దేవత కార్యక్రమము.

ఈ నవరాత్రి ఉత్సవములలో శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతిని, శ్రీ రుక్మిణి సత్యభామ సహిత గోపాల క్రిష్ణ మూర్తిని ఆవాహన చేసి తొమ్మిది రోజులు రెండుపూటలా సహస్ర నామార్చనపూర్వక షోడ

శోపచరములు, పగటిపూట తొమ్మిది రోజులు బ్రాహ్మణా సమారాధనలు భక్తుల సహాయముతో చేయుచున్నారు. ప్రక్రుతి  విపరీత్యములు వచ్చినను  మానకుండగా అవిచ్చిన్నముగా 99 సంవత్సరములు  నుండి నిత్య పూజలు యధావిధి0గా జరుపుచున్నారు.